మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలకు రేపటి నుంచి దరఖాస్తులు

-

మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాల కోసం రేపటి నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 18వ తేదీ నుంచి షురూ కానున్న ఈ ప్రక్రియ ఫిబ్రవరి 6వ తేదీ వరకు కొనసాగనుంది. రాష్ట్రంలోని 204  పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు ముస్లిం, క్రిస్టియన్, పార్శీ, జైన్, సిక్కులతో పాటు మైనార్టీయేతర ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు మైనార్టీ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు.

రాష్ట్రంలోని 194 జూనియర్ కాలేజీలు, 10 సీఓఈ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరానికి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. జూనియర్ కాలేజీల్లో పదో తరగతి జీపీఏ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. సీవోఈ కాలేజీల్లో ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏమైనా సందేహాలుంటే మైనారిటీ గురుకులాల ప్రిన్సిపల్ లేదా వెబ్ సైట్తో పాటు హెల్ప్ లైన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చునని స్పష్టం చేశారు.

ఇదీ ప్రవేశాల విధానం

5వ తరగతి: మైనారిటీలకు ముందొచ్చిన వారికి సీట్లు ఇస్తారు. ఇతరులకు లక్కీ డ్రా ద్వారా కేటాయిస్తారు.

6, 7, 8 తరగతులు (ఖాళీలుంటేనే): మొదట దరఖాస్తు చేసుకున్న వారికి సీట్లు కేటాయిస్తారు.

ఇంటర్‌ ఫస్టియర్‌ (జనరల్‌, ఒకేషనల్‌): పదో తరగతిలో మెరిట్‌ ఆధారంగా సీట్లు ఇస్తారు.

‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’లో ఇంటర్‌: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సీట్లు కేటాయిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news