ఇవాళ ఉదయం నుంచే శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా పొగ మంచు చోటు చేసుకుంది. పొగ మంచు కారణంగా పలు విమానాలు ఆలస్యం అవుతున్నాయి. విమానాల ఆలస్యంపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అయితే.. ఈ పొగ మంచు కారణంగా, మూడు రోజుల్లో 37 విమానాల రాకపోకలను రద్దు చేశారు శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు.
గత మూడు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు కారణంగా విపరీతంగా పొగ మంచు కురుస్తోంది. శంషాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లే విమానాలు రద్దు అయ్యాయి. మొన్న ఆదివారం 14 విమానలు, సోమవారం 15 విమానలు, మంగళవారం 8 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.
విమాన సర్వీస్ ల రద్దు తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రయాణికులు. కాగా,హైదరాబాద్ నుంచి రియాద్‌కు వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త అందింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సౌదీ అరేబియా రాజధాని రియాద్ కు ఫిబ్రవరి 2 నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు నడవనున్నాయి.