కాంగ్రెస్ పై అలిగిన ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి !

-

 

కాంగ్రెస్ సర్కార్ పై తెలంగాణ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అలిగినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు నన్ను పిలవడం లేదని అలిగారు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా ఇద్దరు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి పాల్గొనే కార్యక్రమాల్లో తనను పిలవట్లేదని సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు గుత్తా. మండలి చైర్మన్, ఎమ్మెల్సీ అయిన తనకు ప్రోటోకాల్ పాటించకుండా కలెక్టర్ సైతం ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం లేదని వాపోతున్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి.

Telangana MLC Gutta Sukhender Reddy is said to be angry with the Congress government.

ఇటీవల నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ కోటాలో 4 కోట్ల రూపాయల పనులను గుత్తా ప్రతిపాదించగా ఇంఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆమోదించారు. నల్గొండ కలెక్టర్ ఆర్డర్ కాపీ ఇవ్వగా పనులు సైతం ప్రారంభం అయ్యాయి. సడన్‌గా ఏమైందో తెలియదు కానీ గుత్తాకు సమాచారం ఇవ్వకుండా వర్క్ ఆర్డర్లు రద్దు చేశారు. దీంతో మనస్తాపం చెందిన గుత్తా.. అసెంబ్లీ కార్యదర్శి ద్వారా కలెక్టర్‌కు సభా హక్కుల నోటీస్ ఇవ్వగా కోమటిరెడ్డి జోక్యంతో ఇలా జరిగిందని వివరణ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.

https://www.instagram.com/p/DJN95Qxp8ji/

Read more RELATED
Recommended to you

Latest news