కొత్త సీఎం ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న ఉత్కంఠ

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. సోమవారం రోజునే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పినా.. అభ్యర్థి ఎంపికలో ఆలస్యం కావడంతో ఆ కార్యక్రమం జరగలేదు. అయితే ఇవాళైనా కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఇప్పటికీ ముఖ్యమంత్రి, మంత్రివర్గంపై చర్చలు కొలిక్కిరానట్లు తెలుస్తోంది. దీంతో సీఎం ఎవరు? మంత్రులు ఎవరన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

సోమవారం రోజున పరిశీలకుడు, కర్ణాటక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఇందులో కొత్త సీఎం ఎంపికను ఎమ్మెల్యేలంతా కలిసి అధిష్ఠానానికే అప్పగించాలని తీర్మానించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఏఐసీసీ నేతలు అధిష్ఠానానికి చెప్పి వారితో చర్చించేందుకు డీకే శివకుమార్ దిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ డీకే శివకుమార్‌, మాణిక్‌రావ్‌ ఠాక్రే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీకానున్నారు. ఏఐసీసీ ఆమోదం తర్వాత డీకే శివకుమార్‌ సీఎంను ప్రకటించనున్నారు. అలాగే ఉపముఖ్యమంత్రులను, మంత్రివర్గాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే రాజ్​ భవన్​లో ఏర్పాట్లు మొదలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version