పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898’ AD. సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి మరో అప్డేట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు కల్కితో గ్రాండ్ ట్రీట్ ఇవ్వనున్నారట. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఇక తాజాగా ఈ చిత్రం కోసం పవర్ ఫుల్ థీమ్ మ్యూజిక్ కంపోజ్ చేశారట. శనివారం రోజున చెన్నైలో జరిగిన ఓ మ్యూజిక్ కాన్సర్ట్ లో ఈ థీమ్ ప్లే చేశారు.
ఈ థీమ్ మ్యూజిక్ విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాలో బీజీఎం అదిరిపోద్దని అంటున్నారు. ఈ కాన్సర్ట్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ థీమ్ అండ్ బీజీఎమ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా గురించి చెప్పుకుంటే.. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె, దిశా పటానీ, కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.