నేడు తెలంగాణలో వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్

-

తెలంగాణలో ఇవాళ పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా 13 జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.  ఈ మేరకు ఆయా జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్​, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్​, నిర్మల్​, జగిత్యాల, నిజామాబాద్​, కరీంనగర్​, రాజన్న సిరిసిల్ల, వరంగల్​, పెద్దపల్లి, సిద్దిపేట, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అలాగే ఇతర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించినా ఇప్పటివరకు చెప్పుకోదగ్గ వర్షాలు కురువలేదు. దీంతో రైతుల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే వానాకాలం పంటలు ప్రారంభించడంతో వర్షాలు లేక ఆ పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. ముఖ్యంగా పత్తి రైతులు వాతావరణ శాఖ ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని చెప్పడంతో ఇప్పటికే విత్తనాలు నాటారు. కానీ విత్తనాలు విత్తిన తర్వాత వర్షాలు కురవకపోవడంతో అవి పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా వాతావరణ శాఖ చెప్పిన చల్లనికబురుతో ఇప్పుడు ఆశగా వాన కోసం ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news