తెలంగాణకు మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు !

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈశాన్య ఋతుపవనాల రాకతో తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు.

ఇవాళ హైదరాబాద్ సహా మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, ఖమ్మం, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, నారాయణపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీచేసింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news