ప్రస్తుతం రష్యా – ఉక్రెయిన్ మధ్య భీకర యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశం నుంచి మన ఇండియా కు చెందిన విద్యార్థులు, ఇతరులు స్వదేశానికి తరలి వస్తున్నారు. ఇక వారి కోసం ఉచితంగానే.. ప్రత్యేక విమానాలు నడుపుతోంది కేంద్ర ప్రభుత్వం. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారిని నేరుగా ఢిల్లీకి తీసుకువస్తోంది కేంద్ర ప్రభుత్వం.
అయితే.. ఢీల్లీ కి వచ్చిన తెలంగాణ పౌరులను హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించేందుకు ఉచితంగానే కేసీఆర్ సర్కార్ ఫ్లైట్లు నడుపిస్తోంది. ఇక హైదరాబాద్ వచ్చిన వారు తమ తమ స్వగ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో.. స్వ గ్రామాలకు వెళ్లే విద్యార్థులు, ఇతరుల కోసం.. ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు…. వారందరిని ఫ్రీగా తమ.. తమ స్వగ్రామాలకు తరలించాలని.. ఆర్టీసీ ఎండీ సజ్జ నార్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలంగాణ పౌరులకు భారీ ఊరట లభించనుంది.