Telangana Sarpanch Elections Date Fixed: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల హడావిడి మొదలవుతోంది. బీసీ రిజర్వేషన్లు ఖరారు అయ్యాకనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ తో చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. నిన్న వేణుగోపాల్ తో జరిగిన భేటీలో స్థానిక ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లపై చర్చలు జరిగాయి.

కుల గణనపై ప్రజలలో మంచి రెస్పాన్స్ వచ్చిందని ఆయన అన్నారు. బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చి, బలహీన వర్గాలకు పార్టీ అండగా ఉంటుందనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపాలని సూచించినట్లుగా తెలుస్తోంది. కాగా, సర్పంచ్ ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీ లోపు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంతేకాకుండా రైతుబంధు నిధులను కూడా విడుదల చేసింది రాష్ట్ర సర్కార్.