తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు… సీఎం రేవంత్ కీలక ఆదేశాలు !

-

 

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వెనుకబడిన తరగతుల రిజ‌ర్వేష‌న్ల పెంచడానికి అవసరమైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపు, ఇతర అంశాలపై స‌చివాల‌యంలో ఉన్నతస్థాయి సమావేశంలో స‌మీక్షించారు. రాష్ట్రంలో కుల గణన నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ఆ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళ్లడానికి ఎంత సమయం పడుతుందన్న వివరాలను అధికారులను అడిగారు.

Chief Minister Revanth reddy

బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపుతో పాటు స్థానిక సంస్థ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చే నిధులు ఆగిపోకుండా సాధ్యమైనంత తొందరగా ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి తెలంగాణ‌లో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల వ‌ర‌కు అనుసరించిన విధానాలు, వివిధ రాష్ట్రాల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై సుప్రీంకోర్టులో దాఖ‌లైన కేసులు, వాటి తీర్పులు, ప‌ర్య‌వ‌సనాల‌ను మాజీ మంత్రి జానారెడ్డి వివ‌రించారు.ఇప్పటివరకు అనుసరించిన రిజర్వేషన్ల విధానాలపై క్రమ పద్ధతిలో నివేదిక రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ విషయంలో పంచాయ‌తీరాజ్ శాఖ నిపుణులు, మాజీ ఉన్న‌తాధికారుల స‌ల‌హాలు తీసుకోవాల‌ని, చ‌ట్ట‌ప‌ర‌మైన విష‌యాల్లో అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ తో చ‌ర్చించాల‌ని సూచించారు.
మిగ‌తా రాష్ట్రాలు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో అనుస‌రిస్తున్న విధానాలను అధ్య‌య‌నం చేసి సాధ్యమైనంత తొందరగా నివేదిక రూపొందిస్తే శాస‌న‌స‌భ స‌మావేశాల‌కు ముందే మారోసారి స‌మావేశ‌మై తుది నిర్ణ‌యం తీసుకుందామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version