వర్షాల ప్రభావం.. తెలంగాణ బడి వేళల్లో మార్పులు

-

తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర విద్యా శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని పాఠశాలల పనివేళల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమయ్యేలా మార్పులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యా శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ప్రాథమిక పాఠశాలలు, ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉన్నత పాఠశాలలు పనిచేయనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా పాఠశాలల పనివేళల్లో మార్పులు చేసినట్లు విద్యా శాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. జంట నగరాల (హైదరాబాద్‌-సికింద్రాబాద్) పరిధిలో మినహా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల వేళల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు రెండు రోజుల పాటు గ్యాప్ ఇచ్చిన వాన ఇవాళ సాయంత్రం భారీగా కురుస్తోంది. దాదాపు గంటన్నర పాటు హైదరాబాద్ ను తీవ్రంగా వణికించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నగరాన్ని ముంచెత్తింది.

Read more RELATED
Recommended to you

Latest news