తెలంగాణలో నేడు బడి వేళలు యథాతథం

-

నేడు చందమామ దక్షిణధ్రువం వద్ద చంద్రయాన్‌-3లోని ల్యాండర్‌ ‘విక్రమ్‌’ దిగే చారిత్రక ఘట్టాన్ని నేడు ఇస్రో ప్రత్యక్ష ప్రసారం ఇవ్వనున్న విషయం తెలిసిందే. అయితే ఈ అద్భుత ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు చూపించాలని సోమవారం రోజున తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. అయితే తాజాగా ఆ నిర్ణయాన్ని పాఠశాల విద్యాశాఖ మంగళవారం రాత్రి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

ఇవాళ సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు టీశాట్‌ విద్య, నిపుణ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని డీఈఓలను పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన తొలుత ఆదేశించారు. తరగతులు సాయంత్రం 4.30 గంటలకే ముగియనుండటం.. సాయంత్రం 6.30 గంటల వరకు విద్యార్థులు బడిలోనే ఉండాలంటే పొరుగు గ్రామాలకు వెళ్లేవారికి రవాణా సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో తొలుత జారీ చేసిన ఉత్తర్వులపై పునరాలోచన చేసిన విద్యాశాఖ మంగళవారం రాత్రి వాటిని సవరించింది. పాఠశాలల విద్యార్థులు సాయంత్రం 6.30 గంటల వరకు ఉండాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news