తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే మహానగరం అయిన హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి. కాలు బయట పెట్టకుండా వర్షాలు కురవడంతో.. ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సోమ, మంగళ, బుధ వారాలు మూడు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ నిర్ణయం తీసుకున్నారు.