తెలంగాణ రాష్ట్రానికి ఏ నష్టం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదు : ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి పదేళ్లయిపోయింది. అయినా విభజన చట్టం ప్రకారం జరగాల్సిన.. పంపకాలు మాత్రం పూర్తి కాలేదు. తాజాగా, ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భేటీ అవుతుండటం తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ముందుగా విభజన అంశాలపై చర్చించుకుందామంటూ… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడం.. మళ్లీ రేవంత్ రెడ్డి చర్చించుకుందామంటూ చంద్రబాబుకు లేఖ రాయడం చకచకా జరిగిపోయాయి.. ఇవాళ సాయంత్రం ఆరుగంటలకు ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రజాభవన్ లో భేటీ కానున్నారు.

ఈ నేపథ్యంలోనే పలువురు పలువిధాలుగా మాట్లాడుతున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇరు రాష్ట్రాల సీఎంల చర్చలు సఫలం కావాలని పేర్కొన్నారు. మరోవైపు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రం సంచలన వ్యాఖ్యలే చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఏ నష్టం జరిగినా ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. వాళ్లు ఇద్దరు మిత్రులా..? గురు, శిష్యుల వాళ్ల సత్సంబంధాలు నాకు తెలియదు. కానీ  తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏ ఆస్తి కోల్పోడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశఆరు మహేశ్వర్ రెడ్డి

Read more RELATED
Recommended to you

Exit mobile version