సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రి తుమ్మల లేఖ..!

-

తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తాజాగా ఓ లేఖ రాశారు. ముఖ్యంగా తిరుమల దర్శనం వెళ్ళే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రుల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కోరాలని మంత్రి తుమ్మల లేఖ రాశారు.

కోట్లాది మంది భక్తులు పూజించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్ళే భక్తులకు వసతి మరియు దర్శనం కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను టీ.టీ. డీ అధికారులు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కి మంత్రి తుమ్మల లేఖ రాశారు.  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడుతో భేటీలో తిరుమల దర్శనంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖల పై నిర్ణయం తీసుకునే విధంగా చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసారు మంత్రి తుమ్మల.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version