అమెరికాలో తెలంగాణ యువకుడి దుర్మరణం

-

అమెరికాలో ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగులు ఇటీవల ప్రమాదాల్లో మరణించడం, హత్యలకు గురవ్వడం వంటి ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. యూఎస్ లో  జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అబ్బరాజు పృథ్వీరాజ్‌(30) దుర్మరణం పాలయ్యారు.

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ పరిధిలోని అలకాపురికి చెందిన పృథ్వీరాజ్‌ ఎనిమిదేళ్లుగా యూఎస్‌లోని నార్త్‌ కరోలినాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నిరుడు శ్రీప్రియను వివాహం చేసుకున్నారు. భార్యతో కలిసి బుధవారం కారులో వెళ్తూ.. వర్షం కారణంగా ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టారు. అది పల్టీలు కొట్టి కారులో బెలూన్లు తెరుచుకోవడంతో దంపతులిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. భార్యను కారులోనే కూర్చోబెట్టి… బయటికి వచ్చిన పృథ్వీరాజ్‌ ప్రమాద ఘటనపై పోలీసులకు ఫోన్‌ చేస్తుండగా.. వేగంగా వచ్చిన మరో కారు ఆయన్ని ఢీ కొట్టింది. ఈ క్రమంలో ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచారు. శవ పరీక్షల అనంతరం మృతదేహాన్ని ఆదివారం హైదరాబాద్‌ తీసుకురానున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news