తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల

-

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య టెట్ పరీక్షలు నిర్వహించున్నట్టు పాఠశాల విద్యశాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. కాగా బీసీ రిజర్వేషన్ల బిల్లు సంగతి తేలాక.. రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు నిర్వహించే టెట్ పరీక్షను నిర్వహించేందుకు సిద్ధం అయింది. అయితే ఏడాదికి రెండుసార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది.

ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఏప్రిల్ 15 నుంచి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా.. జూన్ 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించి జూలై 22న ఫలితాలు
విడుదల చేయనున్నారు. ఇక ఒక పేపర్ మాత్రమే రాసే వారికి రూ. ౭౫ం, రెండు పేపర్లు రాసేవారికి
రూ.1000 గా ఫీజు నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news