ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ కేకేఆర్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు బౌలింగ్ చేయనుంది. చెన్నైకి కెప్టెన్ గా ఈ సీజన్ లో ధోని తొలి మ్యాచ్. అయితే ధోనీ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకునేవాడినని పేర్కొనడం విశేషం. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ఉన్న మ్యాచ్ లలో కేవలం చెన్నై ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. గాయం కారణంగా అతను ఈ సీరిస్ నుంచి వైదొలిగాడు. దీంతో కెప్టెన్ గా ధోని వ్యవహరించనున్నాడు.
కేకేఆర్ కూడా ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లలో 2 మ్యాచ్ లలో విజయం సాధించి.. మూడు మ్యాచ్ లల్లో ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్ తొలి స్థానంలో ఉంది.
CSK జట్టు : రచిన్ రవీంద్ర, కాన్వే, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివమ్ దూబె, ధోని, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, అంబోజ్, ఖలీల్ అహ్మద్.
KKR జట్టు : డీకాక్, సునిల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, రింక్ సింగ్, మొయిన్ అలీ, రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రానా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.