రాష్ట్రమంతటా విస్తరించిన నైరుతి.. నేడు మోస్తరు వర్షాలు

-

తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ (జూన్ 14వ తేదీ శుక్రవారం) ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు అన్ని జిల్లాలకు విస్తరించాయని వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. 10 రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాపించాయని వివరించారు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మరోవైపు గురువారం రోజు సాయంత్రం రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో 7.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం పెద్దగోపతిలో 6.8, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం రెడ్డిపల్లిలో 5.5, ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రావినూతలలో 5.3, మధిర మండలం శ్రీపురంలో 5.2, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం సంకీసలో 5.2 సెంటీ మీటర్ల వర్షం కురిసిందని వాతావరణ అధికారులు తెలిపారు ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేట, హైదరాబాద్‌ జిల్లాల్లోనూ అనేక ప్రాంతాల్లో చినుకులు పడ్డాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version