కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. క్లారిటీ ఇదే !

-

భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన రేవంత్ ను కలిసిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. తాజాగా దీనిపై ఆయన స్పందించారు.

tellam venkat rao revanth reddy clarity on party change

‘సోషల్ మీడియాలో నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. అదంతా పచ్చి అబద్ధం. కేసీఆర్ నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చారు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను. కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తా. జై తెలంగాణ’ అని వెంకట్రావు స్పష్టం చేశారు.

కాగా మరికాసేపట్లో రాజ్ భవన్ కు సీఈఓ వికాస్ రాజ్ వెళ్లనున్నారు. గెలిచిన అభ్యర్థుల లిస్ట్ గవర్నర్ కు అందించనున్నారు సీఈఓ. CEO నివేదిక అందిన తరువాత కొత్త శాసనసభ ఏర్పాటుకు విడుదల కానుంది గెజిట్ నోటిఫికేషన్. నిన్న సాయంత్రం తన రాజీనామాను గవర్నర్ కు అందించారు సీఎం కేసీఆర్. ఇక రాజీనామ లేఖ అందిన కొద్ది గంటల్లోనే గవర్నర్ ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్ ను కోరారు గవర్నర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version