తెలుగు వాళ్లు.. ఎక్కడ ఉన్నా మనవాళ్లే : రేవంత్ రెడ్డి

-

తెలుగు వాళ్లు.. ఎక్కడ ఉన్నా మనవాళ్లే అని తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా శిల్పాకళా వేదికలో పద్మ అవార్డుల గ్రహీతను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ సత్కారం చేసే కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిరంజీవిని రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం బాధ్యతగా భావిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూలల ప్రాంతాల్లో పెరిగి స్థానిక కళలను మార్చుకొని అందులోనే తమ జీవితాన్ని గడిపిన దాసరి కొండప్ప, ఆనందచారి, ఉమా మహేశ్వరి, సోమ్ లాల్, విఠాలాచారి లకు కేంద్ర ప్రభుత్వం మట్టిలో మాణిక్యాలను గుర్తించి పద్మ శ్రీ అవార్డులను అందజేసింది.

కేంద్ర ప్రభుత్వం గుర్తించి మీ అందరి సమక్షంలో వారిని సన్మానం చేసే కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం. తెలుగు వాడు ఎక్కడున్నా మనవాడే.. దేశంలో హిందీ భాష తరువాత అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు అన్నారు. మన భాష అంతరించిపోతుందేమోననే అనుమానం వస్తున్న సందేహం కలుగుతుంది.  వృత్తులలో రాణించే కవులు, కళాకారులు ఇలాగే కొనసాగిస్తే.. బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version