రాష్ట్రంలో అప్పుడే భగభగలు షురూ

-

తెలంగాణలో ఈ ఏడాది చలి కాస్త తక్కువగా ఉంది. గత వారం క్రితం వరకు చలిగాలులు వీస్తూ కాస్త చలిగా అనిపించినా ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగిపోయి వెచ్చగానే ఉంటోంది. చలికాలం పూర్తిగా ముగియక ముందే ఎండలు ప్రభావం చూపుతున్నాయి. పలు జిల్లాల్లో 33 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సాధారణం కన్నా నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతోందని తెలిపారు. ఆదివారం ఖమ్మంలో సాధారణం కన్నా 4.8 డిగ్రీలు పెరిగి 33.8 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 4.6 డిగ్రీలు పెరిగి 33.3, హైదరాబాద్‌లో 3.7 డిగ్రీలు పెరిగి 33.2, రామగుండంలో 2.9 డిగ్రీలు పెరిగి 33, నిజామాబాద్‌లో 2.7 డిగ్రీలు పెరిగి 33.5, హనుమకొండలో 2.2 డిగ్రీలు పెరిగి 32 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌లోపు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. ఆసిఫాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో సోమవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో మంగళవారం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. శనివారం రాత్రి రాష్ట్రంలోనే అత్యల్పంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 15.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత రికార్డయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version