BREAKING : ఎంసెట్‌ పేరు మార్చనున్న ప్రభుత్వం!

-

ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష ఎంసెట్ (ఇంజినీరింగ్ అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్). ఎన్నో ఏళ్ల నుంచి సర్కార్ ఈ పరీక్ష నిర్వహిస్తూ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తోంది. అయితే తాజాగా ఎంసెట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేంటంటే..?

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ ప్రవేశాల కోసం ఎంసెట్‌ పేరిట నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష పేరును మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. 2017 నుంచి ఎంసెట్‌లో మెడికల్‌ సీట్ల భర్తీని తొలగించి, ఎంబీబీఎస్‌, ఇతర వైద్యకోర్సులను నీట్‌ ద్వారా భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. అయినా ఎంసెట్‌ పేరులో మెడికల్‌ అనే పదం అలాగే కొనసాగుతోంది. దాన్ని తొలగించాలని ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగింది. మెడికల్‌ పేరును తొలగిస్తూ.. ఎంసెట్‌లో ఎం అక్షరాన్ని తొలగించి, టీఎస్‌ఈఏపీ సెట్‌ లేదా టీఎస్‌ఈఏ సెట్‌ అని మార్చాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక్కడ పీ అంటే ఫార్మసీ అని అర్థం. బీఫార్మసీ సీట్లను ఎంసెట్‌ ద్వారానే భర్తీ చేస్తున్నందున పీ అక్షరాన్ని పొందుపరిచినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version