మంత్రి గంగుల కమలాకర్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న డిమాండ్ తో గురువారం బిజెపి కార్యకర్తలు మంత్రి గంగుల ఇంటి ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు ప్రతిఘటించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం నుండి ముందస్తు అరెస్టులు చేసినా నిరసన ఆగడం లేదు.
మంత్రి ఇంటి గేటు దూకి బిజెపి శ్రేణులు లోపలికి వెళ్లారు. దీంతో పోలీసులు అడ్డుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలని అరెస్టు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని బిజెపి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరి కొంతమంది బిజెపి కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.