భూపాలపల్లిలో రేవంత్ సభలో ఉద్రిక్తత.. ఎస్ఐ సహా పలువురికి గాయాలు

-

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం రోజున టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ వద్దకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు వెళ్ళేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కాశీంపల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేసిన రేవంత్‌రెడ్డి… భూపాలపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్న క్రమంలో స్థానిక బీఆర్​ఎస్ కార్యకర్తలు సుమారు వందమంది సభ వద్దకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుని పక్కనే ఉన్న సినిమా థియేటర్లో నిర్బంధించి ఉంచి గేట్లు మూసేశారు.

అయినా కూడా ఆగని బీఆర్​ఎస్ కార్యకర్తలు సభ జరుగుతున్న ప్రదేశం పైకి రాళ్లు, కోడి గుడ్లతో దాడులు చేశారు. వెంటనే సభ వద్ద ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, సినిమా థియేటర్‌ లోపల ఉన్న బీఆర్​ఎస్ శ్రేణులతో రాళ్లు, సీసాలతో దాడులు చేశారు. పరస్పరం ఒకరికొకరు రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేసుకోవడంతో పది నిమిషాలు పరిస్థితి రణరంగంగా మారింది. ఈ క్రమంలో కాటారం ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డారు. పలువురు కార్యకర్తలు కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version