తెలంగాణలో శాసనసభ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సుడిగాలి పర్యటనలతో రోజుకు మూడు నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు. అయితే…ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి జోరు మీదున్న కారుకు బ్రేకులు వేసేందుకు ఆయా ప్రాంతాల్లో కొన్ని గుర్తులు రంగంలోకి దిగాయి.
ఎన్నికల బరిలో దిగుతున్న రాజకీయ పార్టీలకు ప్రత్యేక గుర్తులు ఉండగా…. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. నిరక్షరాస్యులు కూడా గుర్తుపట్టేలా…. ఈ గుర్తులను నిర్ణయించారు అధికారులు. గ్యాస్ స్టవ్, గ్యాస్ బండ, ప్రెషర్ కుక్కర్, కంప్యూటర్, ల్యాప్టాప్, టీవీ రిమోట్, ఆపిల్, బంతి, కుట్టు మిషన్, కత్తెర, బెలూన్, స్టెతస్కోప్, కెమెరా, క్యారంబోర్డు, బ్యాట్, టార్చిలైట్, హాకీ స్టిక్, మైక్, గాజులు, పల్లకి, ఉంగరం, చెప్పులు ఇలా చాలా గుర్తులనే అధికారులు కేటాయించారు. అయితే ఇవన్నీ కాకుండా కారు స్పీడ్ కు బ్రేకులు వేసేందుకు మాత్రం ఎప్పటిలాగే రంగంలోకి రోడ్డు రోలర్, చపాతీ కర్ర దిగాయి.