యూట్యూబ్​ వరల్డ్​లోకి నాగచైతన్య ఎంట్రీ

-

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అక్కినేని నాగచైతన్య ధూత సినిమాతో డిజిటల్ వరల్డ్​లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా చై చాలా సిగ్గరి. సినిమా ప్రమోషన్స్​ కోసం తప్ప దాదాపుగా ఆయన సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్​గా ఉండడు. తన పర్సనల్ విషయాలు కూడా ఎక్కువగా షేర్ చేసుకోవడానికి ఇష్టపడడు. అలాంటి చై తాజాగా యూట్యూబ్ వరల్డ్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. యూట్యూబ్​లో ఓ ఛానెల్ స్టార్ట్ చేశాడు. అక్కినేని నాగచైతన్య పేరుతో యూట్యూబ్ ఛానెల్​ను ప్రారంభించిన చై.. శుక్రవారం రోజున అందులో తొలి వీడియో షేర్ చేశాడు. హాయ్ యూట్యూబ్ అంటూ తన అభిమానులకు తన ఛానెల్​ను పరిచయం చేశాడు.

ఈ వీడియోలో చై అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఓ నెటిజన్ జుట్టు, గడ్డం పెంచడానకి రీజన్ ఏంటి అని అడగ్గా.. ఆరు నెలలుగా పని లేక ఖాళీగా ఇంట్లో కూర్చున్నానని.. అందుకే పెంచానని సరదాగా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత చందూ మొండేటి దర్శకత్వంలో తాను నటిస్తున్న ఓ సినిమా కోసం పెంచినట్లు అసలు సంగతి తెలిపాడు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news