జిట్టా బాలకృష్ణ అంత్యక్రియల్లో ఉద్రిక్తత.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు!

-

బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి (52) కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో బాలకృష్ణారెడ్డి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు స్వస్థలం భువనగిరికి తరలించారు.

పలు రాజకీయ నాయకులు జిట్టా మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిట్టా బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసేందుకు వారి నివాసానికి వెళ్లారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీంతో జిట్టా బాలకృష్ణారెడ్డి అంతక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని జిట్టా అభిమానులు అడ్డగించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పి అక్కడి నుండి బయటపడ్డారు. ఓ ఉద్యమకారుడికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని జిట్టా అభిమానులు మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news