ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ యువత పోరు ర్యాలీని అడ్డుకున్నారు పోలీసులు.. కలెక్టరేట్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అటు విశాఖ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యువత పోరులో భాగంగా కలెక్టరేట్‌ను ముట్టడించింది వైసీపీ కేడర్. బారీకేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు వైసీపీ కార్యకర్తలు.
వైసీపీ కార్యకర్తలను అడ్డుకోలేకపోయారు పోలీసులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు నినాదాలు చేశారు. ఫీజు బకాయిలు విడుదల చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇది ఇలా ఉండగా… ఈ నిరసనలపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. సమున్నత ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్ మెంట్ ను ప్రభుత్వం నీరుగారుస్తోందని… బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూడా ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోంది.. నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇంతవరకూ ఆ ఊసే లేదు…ఈ ఏడాది తల్లికి వందనాన్ని ఎగ్గొట్టారని ఫైర్ అయ్యారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత.
వైసీపీ యువత పోరు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. కలెక్టరేట్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు.#YSRCP #yuvathaporu pic.twitter.com/OWHE9mzxq0
— greatandhra (@greatandhranews) March 12, 2025