సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు.. త్వరలోనే ‘కీ’ విడుదల

-

తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 15న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పేపర్ -1 పరీక్షకు 84.12 శాతం, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 91.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంలో కఠినంగా వచ్చిన పేపర్ 1 ప్రశ్నపత్రం ప్రస్తుతం చాలా సులభంగానే వచ్చింది. పేపర్ 2 ప్రశ్న పత్రం మాత్రం కాస్త కఠినంగా ఇచ్చారు. ఇందులో కొన్ని ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉన్నాయి. టెట్ పేపర్ 1 పరీక్షకు 2,69,557 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,26,744 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

టెట్ పేపర్ 2 కి సంబంధించి 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా..1,89, 963 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. టెట్ ప్రాథమిక కీ ని మరో మూడు, నాలుగు రోజుల్లో అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. వినాయక చవితి తరువాతనే కీ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. తాత్కాలిక కీ విడుదల అయిన తరువాత అభ్యంతరాలను స్వీకరించి ఆ తరువాత ఫైనల్ కీ విడుదల చేస్తారు. పరీక్షలో అక్కడక్కడ ఓఎమ్మార్ షీట్ల పంపిణీలో తప్పిదాలు జరిగాయని సమాచారం. ఓఎంఆర్ బదులు మరో అభ్యర్థి ఓఎంఆర్ ని పంపిణీ చేశారు. వైట్ నర్ తో సరి చేశారు. అయితే వైట్ నర్ వాడిన ఓఎంఆర్ షీట్లు చెల్లుబాటు అవుతాయని.. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈనెల 27న టెట్ ఫలితాలు విడుదల కానున్నట్టు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version