ఎన్నికల ఫలితాలపై కమిటీలు వేయడానికి కారణం అదే : నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి

-

ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని నల్గొండ ఎంపీ కుందూర్ రఘువీర్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో గెలుపు, ఓటములపై విశ్లేషించుకోవడం నిరంతరమైన ప్రాసెస్ అన్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత కురియన్ నేతృత్వంలో తెలంగాణ ఎంపీ ఎన్నికల ఫలితాలపై కమిటీ వేయడం జరిగిందన్నారు. మహబూబ్ నగర్ గెలుస్తామని భావించామని అక్కడ కేవలం 3వేల మెజార్టీతో తమ అభ్యర్థి ఓడిపోయాడన్నారు.

అలాగే మెదక్ ఎంపీ స్థానం సైతం కచ్చితంగా గెలుస్తామని భావించామని అయితే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై సిద్దిపేటలో ఏకంగా హరీష్ రావు కాషాయ పార్టీకి ఓట్లు వేయించారని రఘువీర్ రెడ్డి ఆరోపించారు. 25 నుంచి 30 స్థానాలు తమకు అధికంగా వచ్చి ఉంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చే వాళ్లమన్నారు. హర్యానా, ఢిల్లీలో ఎలక్షన్స్ రానున్నాయని అక్కడ సైతం పార్టీని బలోపేతం చేసేందుకు కమిటీలో దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న పార్టీయే లోకల్ ఎన్నికల్లో సత్తా చాటుతుందన్నారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో సైతం ఓవరాల్ గా తమ పార్టీకే అధికంగా ఓట్లు పోలయ్యాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version