రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మరింత అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించారు. ప్రధాని మోడీ రిమోట్ తో రహదారులను ప్రారంభించారు. రూ. 13700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు ప్రధాని మోడీ.  ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 80వేల కోట్ల రూపాయలతో రైల్వే అభివృద్ధి పనులు  చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి 1లక్ష 20వేల కోట్ల జాతీయ రహదారుల నిర్మాణానికి ఖర్చు చేసినట్టు తెలిపారు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు ఎనిమిది జిల్లాలకు అనుసంధానం చేస్తూ.. ఆ రోడ్డు నిర్మాణమైతే హైదరాబాద్ అబివృద్ధి  జరుగుతుంది. 26 వేల కోట్లతో ట్రిపుల్ ఆర్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు కిషన్ రెడ్డి. 

దేశ వ్యాప్తంగా వందేభారత్ 3 ట్రైన్ లు ప్రారంభించారు. బీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు.. వేల కోట్ల రూపాయలు ఖర్చులు చేస్తే.. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికీ సమయముండదు. నరేంద్ర మోడీ  పలువృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు తెలంగాణకు వస్తే..  సీఎం కి సమయముండదు. ఇది ఏ మాత్రం న్యాయం కాదు.. తెలంగాణకు చాలా నష్టం జరుగుతుంది. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సీఎం లేడన్నారు కిషన్ రెడ్డి. 

 

Read more RELATED
Recommended to you

Latest news