Telangana: మహిళల బండ బూతులు.. ఫ్రీ బస్సును పోలీస్ స్టేషన్ ముందు ఆపిన డ్రైవర్

-

మహిళా ప్రయాణికుల బూతులు భరించలేక.. పోలీస్‌ స్టేషన్‌ ముందే బస్సు ఆపేశాడు ఆర్టీసీ డ్రైవర్‌. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఇది మా ఫ్రీ బస్సు.. మా ఇష్టం వచ్చినంత సేపు ఆగాల్సిందే లేదంటే మా వాళ్ళతో కొట్టించి సస్పెండ్ చేయిస్తాం అంటూ ఆర్టీసీ బస్ డ్రైవర్ మీద మహిళలు బూతు పురాణం వదిలారు.

The driver stopped the free bus in front of the police station

నార్కెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వస్తుండగా నకిరేకల్ బస్టాండులో ముగ్గురు మహిళలు మా చుట్టపు మనిషి వస్తుంది ఆగమని డ్రైవరును కోరారు. అప్పటికే 5 నిమిషాలు ఆపగా తోటి ప్రయాణికులు గొడవ చేయడంతో బస్సును డ్రైవర్ ముందుకు కదిలించాడు.

దీంతో ఆ మహిళలు డ్రైవరును బూతులు తిడుతూ సూర్యాపేట వెళ్ళిన తరువాత మా వాళ్ళతో కొట్టిస్తాం.. డ్యూటీ ఎలా చేస్తావో చూస్తాం.. అని బెదిరించారు. తమ విధులకు ఆటంకం కలిగించారు అంటూ బస్సును పోలీస్ స్టేషన్ ముందు ఆపిన డ్రైవర్. పోలీసులు వచ్చి విచారించగా తాము పోలీస్ స్టేషన్ లోకి రామని భీష్మించుకుని కూర్చున్న మహిళా ప్రయాణికులు. దీంతో చేసేదేం లేక వెనుతిరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news