రేపటి వరకు అలా నిరూపిస్తే.. రాజీనామా చేస్తా : కేటీఆర్

-

అటెండర్ గ్రూపు నుంచి గ్రూపు 1 ఆఫీసర్ వరకు ప్రభత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానిక అభ్యర్థులకు ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ తప్ప మరేది లేదన్నారు. అలా ఉంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు రాష్ట్ర యువతకు చూపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సవాల్ చేశారు. గడిచిన పదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన ఇతర రాష్ట్రం ఉంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు చూపించాలని లెక్కలతో సహా నిరూపిస్తే.. రేపటివరకు తాను ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి వెళ్లిపోతాయని ఇది కాంగ్రెస్, బీజేపీలకు ఆఫర్ అన్నారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన 32వేల ఉద్యోగాలు ఇచ్చానని.. రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన వాటికి పరీక్షలు ఎప్పుడూ జరిగాయి.. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో చెప్పారు. బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్ వచ్చిందని వెల్లడించారు. ఏప్రిల్ 2023లో గురుకులాల నోటిఫికేషన్, అలాగే పోలీస్ శాఖలో 2022లో బీఆర్ఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లకు ఈయన జాబ్ లు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news