శ్మశానం కోసం ఊరు ఊరంతా ఒక్కటై పోరాటం..!

-

సాధారణంగా జైలులో కూడా ఉరిశిక్ష వేసే సమయంలో చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. అయితే ఎవ్వరైనా చివరి కోరిక నెరవేర్చుతుంటారు. కానీ మనిషి చివరి మజిలీ శాశ్వతంగా ప్రశాంతి నిద్రపోయే స్థలం అక్కడ వివాదాలకు గురవుతోంది. ఈ‌ స్థలం నాదంటూ ఓ వ్యక్తి హద్దులు పాతడంతో ఊరు రెండుగా చీలింది. ఊరికి ఉత్తరాన ఉన్న ఈ స్థలం శ్మశానాకి దక్కాల్సిందే అంటూ చివరికి ఊరు ఊరంతా ఒక్కటైంది. శ్మశాన వాటిక స్థలాన్ని  కబ్జా చేశాడంటూ ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది.  దీంతో శ్మశానం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్దం అంటూ ప్రకటించింది ఆ గ్రామం.

ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో స్మశాన వాటిక స్థలం వివాదస్పదంగా మారింది. శతాబ్ద కాలంగా శ్మశానంగా కొనసాగుతున్న స్థలాన్ని ఓ వ్యక్తి గత ఆరేళ్ల క్రితం కబ్జా చేశాడు. రెవెన్యూ రికార్డ్ ల ప్రకారం పంట పొలం పక్కనే ఉన్న 79 సెంట్ల భూమిని తనదేనంటూ బుకాయిస్తూ.. గత ఆరేళ్లుగా అంత్యక్రియలకు అడ్డుపడుతూ వస్తున్నాడు. శ్మశానానికి స్థలం కరువవడంతో ఎవరు చనిపోయినా అంతిమ సంస్కరాలకు స్థలం లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడక తప్పడం లేదు. దీంతో విసిగి వేశారిన గ్రామస్తులంతా ఒక్కటై శ్మశాన‌ స్థలాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా పోరాటానికి దిగారు. కబ్జాకు గురైన భూమిలో గ్రామస్తులంతా కట్టెలు పాతి శ్మశాన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news