రైతులకు బిగ్ రిలీఫ్.. ఐటీ కట్టే వారికి కూడా రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. రైతులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రైతు భరోసా రాదేమోనని భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసా అమలుపై వనపర్తిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘రుణమాఫీని ఆగస్టులో చేస్తాం. దీనివల్ల పెట్టుబడి సాయం కొంచెం ఆలస్యం కావచ్చు. ప్రకృతి వైపరీత్యాలతో పంటనష్టం జరిగితే రూ. 10 వేల వరకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా, ఉమ్మడి జిల్లాల వారీగా రైతు భరోసాపై ప్రభుత్వం వర్క్ షాప్‌లు నిర్వహింస్తోంది. రైతులతో సమావేశమై వారిచ్చే సలహాలు, సూచనలను ఆచరణలోకి తీసుకోనున్నారు. 10న ఖమ్మం. 11,అదిలాబాద్, 12 మహబూబ్‌నగర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్క్‌షాపులు నిర్వహించింది. 15 వరంగల్, 16 మెదక్, 18 నిజామాబాద్, 19 కరీంనగర్, 22 నల్గొండ, 23 రంగారెడ్డి ఆయా జిల్లాల వారీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్క్‌షాపులు నిర్వహించనున్నది.