హైదరాబాద్‌లో రూ. కోటి కైట్!

-

హైదరాబాద్‌లో రూ. కోటి కైట్ తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లోని పాతబస్తీలో గోల్డ్ కైట్ ఛాలెంజ్ కలకలం సృష్టించింది. రూ.కోటి బంగారు గాలిపటం అంటూ సోషల్ మీడియాలో ఓ గోల్డ్ మ్యాన్ ప్రకటించినట్లు తెలుస్తోంది.దీంతో గోల్డ్ ‌కైట్ కోసం ఓల్డ్ సిటీ యువకులు గొడవలకు దిగే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోటి రూపాయల గోల్డెన్ కైట్ కు.. 40 లక్షల మాంజా కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతోంది.  

The Gold Kite Challenge has created a stir in Hyderabad’s Old Townఅయితే… సోషల్ మీడియాలో గోల్డ్ మెన్ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు కూడా చెబుతున్నారు.  ఇది తెలియక కోటి రూపాయల పతంగి కోసం హైదరాబాద్ పాతబస్తీలో యువత ఎగపడుతోందట. గోల్డెన్ కైట్ కోసం కొట్టుకుని తొక్కిసలాట జరిగి ఎవరైనా చనిపోతే బాధ్యులు ఎవరంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గోల్డ్ మెన్ ను అరెస్టు చేసి, కోటి రూపాయల కైట్ ను స్వాధీనం చేసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news