ఉపాధి హామీ సిబ్బందికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

-

తెలంగాణ లోని ఉపాధి హామీ సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న సిబ్బందికి నాలుగు నెలల బకాయి వేతనాలు  విడుదల చేసింది. రాష్ట్రంలో ఈ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీవోలు మొత్తం 3,200 మందికి చెందిన రూ.62 కోట్ల వేతన బకాయిలు మంగళవారం విడుదల అయ్యాయి. అయితే తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తక్షణమే తమ జీతాలు విడుదల చేయాలని గత కొద్ది రోజులుగా వీరంతా నిరసనకు దిగారు. దీనిపై స్పందించిన సర్కార్ నేడు ఆ పెండింగ్ బకాయిలను విడుదల చేసింది.

ఇటీవల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ఉపాధీ హామీ పథకంలో భాగంగా పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీవోలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం స్పందించి ఇవాళ పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news