10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం !

-

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఈ నెల 4న తెలంగాణ కేబినేట్‌ సమావేశం జరుగనుంది. అయితే… బడ్జెట్ సమావేశాలపై ఈ నెల 4న తెలంగాణ కేబినేట్‌ సమావేశంలో చర్చించనున్నారు. ఇక ఈ నెల 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నట్లు సమాచారం. గవర్నర్ ప్రసంగంతో ఉభయసభలు మొదలు కానున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది.

ఈ నెల 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ రాష్ట్ర సర్కార్‌. కాగా, ఇందిరమ్మ ఇళ్లు మరియు ఆరు గ్యారంటీల వంటి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి భారీగా నిధుల సమీకరణ కోసం 2,620 ఎకరాల భూములు అమ్మేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ పరిధిలో ఉన్న 1,800 ఎకరాలు మరియు హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న 820 ఎకరాల భూములు ఉండగా కబ్జాలకు గురవుతున్నాయి.. కాపాడలేము అనే సాకు చెప్పి వేలం వేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news