సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పాలన అటకెక్కిందంటూ విపక్ష నాయకులు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎన్నిక కోసం కాంగ్రెస్ నేతలు ఢిల్లీ టూర్లే సరిపోయాయంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో కీలక శాఖలన్ని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే పెట్టుకున్నారని కామెంట్ చేశారు. అయితే, ఆ శాఖల అధికారాలు మాత్రం ఢిల్లీ పెద్దల చెతుల్లో ఉన్నాయంటూ అని అన్నారు. సీఎం రేవంతు కాంగ్రెస్ అధిష్టానం ముప్పుతిప్పలు పెడుతోందంటూ ఎద్దేవా చేశారు. సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబీను కలిస్తే తప్పు లేదని కానీ, అధిష్టానం ఆ విషయంలో రేవంత్కు అనుమతి ఇచ్చిందో లేదో తెలియాలని అన్నారు. ఏ క్షణంలో అయినా అ సమావేశం రద్దు కావొచ్చంటూ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు.