ప్రగతి భవన్ లో కొనసాగుతోన్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

-

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం కొన‌సాగుతోంది. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, కేంద్రం తెచ్చే బిల్లులు తదితర అంశాలపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహంపై చ‌ర్చిస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు, లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్‌రావు సహా ఎంపీలందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సెప్టెంబర్ 18 నుంచి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇండియా పేరు మారడం.. రాజ్యాంగ సవరణ చేయడం, కొన్ని కీలక బిల్లులను ఆమోదించడం, జమిలీ ఎన్నికలు ఇలా రకరకాలుగా ప్రత్యేక సమావేశాలకు ప్రత్యేకం కానున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఎంపీలు పార్లమెంట్ లో ఏవిధంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news