ఆసియా కప్ 2023: నామమాత్రం మ్యాచ్ లో ఇండియా ఫీల్డింగ్… తిలక్ వర్మ డెబ్యూ !

-

ఈ రోజు ఇండియా మరియు బంగ్లాదేశ్ ల మధ్యన కొలంబో వేదికగా నామమాత్రంగా చివరి సూపర్ 4 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఇండియా బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. ముందుగా టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకుని బంగ్లాదేశ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. కాగా ఈ రోజు మ్యాచ్ లో ఇండియా ఏకంగా అయిదు మార్పులను చేయడం విశేషం. కొత్తగా జట్టులోకి తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ మరియు ప్రసిద్ద కృష్ణలు వచ్చారు.. ఇక వీరికి కోహ్లీ, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, బుమ్రా మరియు సిరాజ్ లు దారిచ్చారు. కాగా ఇప్పటికే బంగ్లాదేశ్ రెండు కీలక వికెట్లు కోల్పోయి ప్రమాదంలో పడింది. ఇండియా లాంటి బలమైన బౌలింగ్ లైన్ అప్ ఉన్న జట్టుపై ఆడడం బంగ్లాదేశ్ కు ఏమంత సులభం కాబోదు.

ఇక బంగ్లాదేశ్ కూడా కీలకమైన మార్పులు చేసింది, ముఖ్యంగా ఓపెనర్ గా వచ్చి వరుసగా విఫలం అయిన నయీమ్, తస్మిన్ అహమద్, షోరిఫుల్ ఇస్లాం , హాసన్ మహమ్మద్ లను తొలగించి టాంజిద్ హాసన్, అనముల్ హాక్, ముస్తాఫిజర్ రహమాన్, మహేది హాసన్ లను తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news