సీతక్కకు ఫోన్ చేసి తిట్టిన అజ్ఙాత వ్యక్తి..రంగంలోకి పోలీసులు !

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కకు ఘోర అవమానం ఎదురైందని సమాచారం. సీతక్క ఫోన్ చేసి ఓ వ్యక్తి తిట్టారట. అయితే.. దీనిపై వెంటనే యాక్షన్‌ లోకి దిగిన పోలీసులు..ఆ నిందితున్ని అరెస్ట్ చేశారట. మంత్రి సీతక్కకు ఫోన్ చేసి తిట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

The person who called Sitakka and cursed him The police arrested him

ఈ నెల 4న గుర్తుతెలియని వ్యక్తి సీతక్కకు మూడుసార్లు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించాడని వార్తలు వస్తున్నాయి. అయితే… దీంతో మంత్రి సీతక్క తన డ్రైవర్ శ్రీనుతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించిందని ప్రాథమిక సమాచారం. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అనంతరం ఆ అజ్ఙాత వ్యక్తి మొబైల్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news