TSRTC: ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ మీద దాడి..ఇద్దరు యువకులు అరెస్ట్‌

-

ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ మీద దాడి చేసి చేయి విరగొట్టారు ఇద్దరు యువకులు. ట్యాంక్ బండ్ పై ఆదివారం రోజు రాత్రి ఫరూక్ నగర్ డిపోనకు చెందిన డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు యువకులు విచక్షణారహితంగా రాత్రి దాడి చేశారు. క్రికెట్ బ్యాట్ తో వారిని తీవ్రంగా కొట్టడంతో కండక్టర్ రమేష్ ఎడమ చేయి విరగగా.. డ్రైవర్ షేక్ అబ్దుల్ కి గాయాలయ్యాయి. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు నిందితులు మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీంలను అరెస్ట్ చేశారు పోలీసులు.

The police arrested Mohammad Majeed and Mohammad Qasim

అటు ఈ సంఘటనపై TSRTC కూడా స్పందించింది. పదే పదే హెచ్చరిస్తోన్న TSRTC సిబ్బందిపై ఉద్దేశ్యపూర్వకంగా కొందరు దాడులకు దిగుతుండటం దురదృష్టకరమని సజ్జనార్‌ పేర్కొన్నారు.  ఇది సమాజానికి  ఏమాత్రం శ్రేయస్కరం కాదు. తాజాగా Hyderabad ట్యాంక్ బండ్ పై ఇద్దరు ఫరూక్ నగర్ డిపోనకు చెందిన డ్రైవర్, కండక్టర్ పై విచక్షణరహితంగా ఆదివారం రాత్రి దాడి చేశారు. క్రికెట్ బ్యాట్ తో వారిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో కండక్టర్ రమేష్ ఎడమ చేయి విరగగా.. డ్రైవర్ షేక్ అబ్దుల్ కి గాయాలయ్యాయన్నారు. ఈ ఘటనలో నిందితులు మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీంలను పోలీసులు అరెస్ట్ చేశారని వివరించారు సజ్జనార్‌.

Read more RELATED
Recommended to you

Latest news