ప్రజల ఆశీస్సులతోనే సామాన్యుడినైన తాను సీఎం అయ్యానని తెలిపారు రేవంత్ రెడ్డి. పెద్దపల్లి యువ వికాసం సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ తొలుత ఈ గడ్డపై నుంచే చెప్పారు. సోనియాగాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కేసీఆర్ పాలనలో గిట్టుబాటు ధర రాక రైతులు ఉరేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. పెద్దపల్లికి రూరల్ పీఎస్, మహిళా పీఎస్, మంతథనిలో 100 ఆసుపత్రికి, 4 వైపుల బైపాస్ రోడ్డు వంటి పనులకు రూ.1500 కోట్ల నిధులు కేటాయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాల్లో ఉద్యమం లేదు అన్నట్టుగా ప్రచారం చేశారు. విద్యుత్ శాఖకు సంబంధించి.. పాల్వంచలో మొదటిసారిగా ఉద్యోగం కోసం ప్రారంభమైన పోరాటం తెలంగాణ ఉద్యమంగా మారింది.
పాల్వంచలో ఉద్యోగం కోసం మొదలైన పోరాటం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దిశగా అడుగులు వేసింది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను మీ అభిమానంతో సీఎం అయ్యానని తెలిపారు. ఉద్యోగాలు, ప్రాంత అభివృద్ధి కోసమే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామన్నారు. పెద్దపల్లికి SRSP నుంచి నీళ్లు రాకపోతే పోరాడిన వాళ్లను జైలులో వేశారు కేసీఆర్. ప్రాజెక్టుల గురించి కేసీఆర్ మాట్లాడారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకుంటామన్నారు.