RTC bus Accident: తెలంగాణ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది ప్రయాణికులకు గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో కరంజీ (టి) నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న బస్సు ఆర్లీ(టి) గ్రామంలోకి రాగానే అదుపుతప్పి బస్సు రోడ్డు పక్కనే ఉన్న బక్కి ఆనిల్ అనే రైతు కొట్టంలోకి దూసుకెళ్లి.. కట్టేసి ఉన్న ఎద్దును ఢీ కొట్టింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా.. చాలా మందికి గాయాలు అయినట్లు చెబుతున్నారు. ఇక గాయాలు అయిన వారిని వెంటనే ఆస్పత్రికి కూడా తీసుకెళ్లారట. ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.