మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి నియామకం పట్ల రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి : twjf

-

మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి నియామకం పట్ల రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని twjf రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. తాజాగా ఆయన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కొత్త వారికి అవకాశం ఇవ్వకుండా, మళ్లీ గతంలో చైర్మన్ గా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి కి అవకాశం ఇవ్వడం సరి కాదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చైర్మన్ గా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి కి మళ్ళీ అవకాశం ఇవ్వడం, కొత్త వారు అవకాశం కోల్పోయారు. ఒకవైపు రాష్ట్రంలో కుల జన గణన చేస్తూనే, 93 శాతం జనాభా ఉన్న బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు అవకాశం ఇవ్వకపోవడం కూడా సరి అయింది కాదు.

రాష్ట్రంలో పత్రికలు చదువుతున్నథి, చానల్ లు చూస్తున్నది మెజారిటీ ప్రజలు. మీడియాలో మెజారిటీ గా పనిచేస్తున్నా వారు బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన జర్నలిస్ట్ లే. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో బ్రాహ్మణ కులానికి చెందిన దేవులపల్లి అమర్ కు, రెడ్డి కులానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి కి, వైశ్య కులానికి చెందిన తిరుమలగిరి సురేందర్ కు, టిఆర్ఎస్ ప్రభుత్వం బిసి కులానికి చెందిన అల్లం నారాయణ కు అవకాశం కల్పించారు. మరి మైనార్టీ లు, ఎస్సీ లు, ఎస్టీ లకు అవకాశం రావాల్సి ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి, ఈ నియామకం రద్దు చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియ చేస్తాము.

Read more RELATED
Recommended to you

Latest news