బాత్రూమ్ లో కాలు జారి టాలీవుడ్ నిర్మాత కన్నుమూత..!

-

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత వి.మహేష్ (85) అకస్మాత్తుగా మరణించారు. చెన్నైలోని తన ఇంట్లో బాత్రూమ్ నుంచి బయటకు వస్తూ కాలు జారి కింద పడ్డారు. దీంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ తరుణంలోనే పలువురు సెలబ్రిటీలు మహేస్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.

1975లో మాతృమూర్తి మూవీతో వి.మహేష్ నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ తో మనుష్యులంతా ఒక్కటే, మహాపురుషుడు, చిరంజీవితో సింహపురి సింహం, సుమన్ తో ముసుగు దొంగ వంటి సినిమాలను నిర్మించారు. మనుష్యులంతా ఒక్కటే సినిమాకి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును అందుకున్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ లో ప్రసారమైన హరి భక్తుల కథలు సీరియల్ ప్రొడ్యూసర్, రైటర్ గా పని చేశారు. నెల్లూరు జిల్లాలోని కొరుటూరు నిర్మాత మహేష్ సొంత ఊరు. పెళ్లి చేసుకోకుండానే చివరికీ ఉండిపోయారు. ఈయన అంత్యక్రియలు చెన్నైలో సోమవారం మధ్యాహ్నం జరుగుతాయని ఆయన మేనల్లుడు టెలివిజన్ నిర్మాత, దర్శకుడు వల్లభనేని మహీధర్ వెల్లడించారు. 

Read more RELATED
Recommended to you

Latest news