డిసెంబర్ 09 లోపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

-

తెలంగాణ సచివాలయంలో వచ్చే డిసెంబర్ 09 లోపు  తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి.  సోమాజీగూడలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. దాదాపు పదేళ్లు అధికారంలో ఉన్న మీరు.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పదేళ్లలో ఏనాడు విగ్రహం పెట్టాలనే ఆలోచన రాని వాళ్లకు ఇవాళ ప్రశ్నించే నైతికత లేదన్నారు. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన తరువాత.. ఏ రోజు తొలగిస్తారో చెబితే తాము కూడా వస్తామని విమర్శించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకోకముందే ఏమవుతుందో చూపిస్తామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి.

అధికారంలో కోల్పోయినా కానీ కొందరికీ మాత్రం అహంకారం తగ్గడం లేదన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకున్న చోట కేటీఆర్ తన తండ్రి విగ్రహం పెట్టాలనుకుంటున్నారా..? కేసీఆర్ సచ్చేది ఎప్పుడూ.. ఆయన విగ్రహం పెట్టేది ఎప్పుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మీలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రేటేరియట్ బయటకాదు.. లోపల పెడతామని తెలిపారు. మీ అయ్య పదేళ్లు తెలంగాణను దోచుకున్న దొంగ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version