తెలంగాణ ప్రభుత్వం సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందట. మరోసారి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీకి రంగం సిద్దం చేసిందట తెలంగాణ ప్రభుత్వం. ఈ సారి ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో కూడిన బ్యాగులతో పంపిణీ చేయనున్నట్లు సమాచారం అందుతోంది.

ఇప్పటికే ఈ బ్యాగులు గోదాములకు చేరినట్టు సమాచారం. కాగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో ప్రభుత్వం అలర్ట్ అవుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. మూడు రోజులపాటు వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలను చేపట్టాలని కోరారు. రెస్క్యూ కోసం ప్రతి జిల్లాకు రూ. కోటి విడుదల చేసినట్లుగా తెలిపారు. మరోవైపు జిహెచ్ఎంసిలో మున్సిపల్, ట్రాఫిక్ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.